తెలంగాణ

telangana

ETV Bharat / business

రెండో రోజూ తగ్గిన బంగారం ధరలు.. నేటి లెక్కలివే... - Gold drops Rs 182, silver tumbles Rs 1,083

బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.182 పతనమై రూ.41,019కి చేరింది. రూ.1,083 మేర పడిపోయిన కిలో వెండి ధర రూ.46,610కి చేరుకుంది.

Gold drops Rs 182, silver tumbles Rs 1,083
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడు ఎంతంటే..!

By

Published : Jan 29, 2020, 4:06 PM IST

Updated : Feb 28, 2020, 10:08 AM IST

బంగారం ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడటం వల్ల దిల్లీలో పసిడి ధర రూ.182 పతనమైంది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.41,019గా ఉంది.

వెండి ధర కిలోకు రూ.1,083 మేర క్షీణించింది. దేశ రాజధానిలో కేజీ వెండి రూ.46,610గా ఉంది.

రూపాయి మారకం

డాలర్​తో పోలిస్తే రూపాయి 12 పైసలు వృద్ధితో 71.21 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లు

అయితే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా వృద్ధి చెందింది. ప్రస్తుతం ఔన్సు పుత్తడి 1,568 డాలర్ల వద్ద ఉండగా ఔన్సు వెండి ధర 17.47 వద్ద కొనసాగుతోంది..

Last Updated : Feb 28, 2020, 10:08 AM IST

ABOUT THE AUTHOR

...view details