తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయంగా డిమాండ్​ తగ్గుదలతో దిగొచ్చిన పసిడి - వాణిజ్య వార్తలు తెలుగులో

ఇటీవల వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళా స్వల్పంగా దిగొచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి.. 161 రూపాయలు తగ్గింది. కిలో వెండిపైనా రూ. 425 తగ్గింది.

gold-drops-rs-161-on-weak-global-trends-tepid-demand
అంతర్జాతీయంగా డిమాండ్​ తగ్గుదలతో దిగొచ్చిన పసిడి

By

Published : Dec 2, 2019, 4:20 PM IST

పసిడి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్​ తగ్గడం, అమ్మకాలే దీనికి కారణం.

24 క్యారెట్ల బంగారం దిల్లీలో రూ. 161 తగ్గింది. శనివారం రూ. 38 వేల 879 వద్ద ఉన్న 10 గ్రాముల పుత్తడి ప్రస్తుతం 38 వేల 718 రూపాయలకు చేరింది.

రూ. 425 తగ్గిన సిల్వర్​...

వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. కిలో వెండిపై రూ. 425 క్షీణించి.. 45, 730 రూపాయలకు చేరింది. శనివారం రోజు కిలో వెండి ధర రూ. 46, 155 గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఔన్సుకు వరుసగా 1456, 16.84 డాలర్లుగా ట్రేడవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details