తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. పసిడి బాటలోనే వెండి - బిజినెస్ వార్తలు తెలుగు

బంగారం, వెండి ధరలు నేడు కాస్త తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.130 క్షీణించింది. వెండి కిలోకు రూ.90 తగ్గింది.

బంగారం

By

Published : Nov 12, 2019, 4:22 PM IST

పసిడి ధర నేడు స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.130 క్షీణించింది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుత ధర రూ.38,550కి చేరింది.

కిలో వెండి ధర (దిల్లీలో) నేడు స్వల్పంగా రూ.90 తగ్గి.. రూ.45,080 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. ఔన్సు బంగారం ధర 1,453 డాలర్లకు చేరింది. వెండి ఔన్సుకు 16.81 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి: నకిలీ వార్తలపై కఠిన చర్యలకు ట్విట్టర్​ సంసిద్ధం!

ABOUT THE AUTHOR

...view details