బంగారం, వెండి ధరలు బుధవారం తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.92 తగ్గి.. రూ.48,424 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గటం ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు - gold and silver price today
బంగారం ధర బుధవారం తగ్గింది. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.91 దిగొచ్చింది. వెండి ధర కిలో రూ.70,181కి చేరింది.
బంగారం, వెండి ధరలు
పసిడి బాటలోనే వెండి ధర కూడా రూ.414 (కిలోకు) తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,181 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,893 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 27.65 డాలర్ల వద్ద ఉంది.