దేశంలో పసిడి ధరలు మరోసారి తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర సోమవారం రూ.464 తగ్గి.. రూ.47,705కి చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణతతో బంగారం ధరలు దిగివస్తున్నట్లు నిపుణులు తెలిపారు.
Gold Price: తగ్గిన బంగారం, వెండి ధరలు - gold price today
పసిడి, వెండి ధరలు సోమవారం దిగొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.464 తగ్గింది. వెండి కిలో ధర రూ.71వేల మార్కును కోల్పోయింది.
![Gold Price: తగ్గిన బంగారం, వెండి ధరలు today gold and silver price](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12127783-thumbnail-3x2-gold.jpg)
నేటి బంగారం, వెండి ధరలు
వెండి ధర రూ.723 (కిలోకు) క్షీణించింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,420 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,858 డాలర్లకు చేరింది. వెండి ఔన్సుకు 27.70 డాలర్ల వద్ద ఉంది.