తెలంగాణ

telangana

By

Published : Feb 26, 2021, 4:28 PM IST

ETV Bharat / business

ఒక్కరోజే రూ.2000 తగ్గిన కిలో వెండి ధర

వెండి ధర శుక్రవారం భారీగా తగ్గింది. కిలో ఏకంగా రూ.2 వేలకుపైగా దిగొచ్చి.. రూ.67,500 దిగువకు చేరింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర కూడా రూ.342 తగ్గింది.

Gold and Silver price today
నేటి బంగారం వెండి ధరలు

పసిడి, వెండి ధరలు శుక్రవారం దిగొచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.342 తగ్గి.. రూ.47,599 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా పసిడి డిమాండ్​కు అనుగుణంగా దేశీయంగానూ బంగారం ధరలు తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కిలోకు (దిల్లీలో) భారీగా రూ.2,007 దిగొచ్చింది. కిలో ధర ప్రస్తుతం రూ.67,419 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,760 డాలర్లకు తగ్గింది. వెండి ధర 26.78 డాలర్లకు చేరింది.

ఇదీ చదవండి:దలాల్​ స్ట్రీట్​ ఢమాల్​- సెన్సెక్స్​ 1939 పాయింట్లు డౌన్​

ABOUT THE AUTHOR

...view details