తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - భారత్​లో బంగారం వెండి ధరలు

బంగారం, వెండి ధరలు గురువారం భారీగా దిగొచ్చాయి. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.48,250 దిగువకు చేరింది. కిలో వెండి ధర దాదాపు రూ.1,300 తగ్గింది.

Gold rate today
బంగారం ధర

By

Published : May 27, 2021, 4:06 PM IST

బంగారం, వెండి ధరలు గురువారం భారీగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర (Gold price today) రూ.319 తగ్గి.. రూ.48,223 వద్దకు చేరింది. డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ పుంజుకోవడం బంగారం ధర తగ్గేందుకు కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర (Silver price today) ఏకంగా రూ.1,287 (కిలోకు) తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,637 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,900 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 27.70 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చదవండి:Stocks Closing: స్వల్ప లాభాలతో సరి- సెన్సెక్స్​ 98 ప్లస్​

ABOUT THE AUTHOR

...view details