తెలంగాణ

telangana

ETV Bharat / business

దిగొచ్చిన బంగారం, వెండి ధరలు - పది గ్రాముల బంగారం ధర

దేశీయంగా పసిడి, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. మంగళవారం.. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.47 వేల దిగువకు చేరింది. వెండి ధర కిలో రూ.110కి పైగా తగ్గింది.

Gold Rate today
నేటి బంగారం ధరలు

By

Published : Apr 20, 2021, 4:27 PM IST

ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మంగళవారం కాస్త తగ్గాయి. 10 గ్రాముల స్వచ్చమైన పసిడి ధర రూ.305 తగ్గి.. రూ.46,756 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన డిమాండ్, డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ పెరగటం వంటివి ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కూడా కిలోకు రూ.113 తగ్గింది. దీనితో కిలో ధర రూ.67,810 కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకు 1,768 డాలర్లకు దిగొచ్చింది. వెండి ధర ఔన్సుకు 25.90 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చదవండి:యూఏఎన్​ లేకుండానే పీఎఫ్​ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చా?​

ABOUT THE AUTHOR

...view details