అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలతో పసిడి ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో నేడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 166 తగ్గింది. రూ. 38,604 వద్ద స్థిరపడింది.
" అంతర్జాతీయంగా బంగారం ధరల తగ్గుదలతో దిల్లీలో ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి ధర రూ.166 క్షీణించింది."
- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు
బంగారం దారిలోనే వెండి కూడా భారీ స్థాయిలో క్షీణత నమోదు చేసింది. కిలో వెండి రూ.402 తగ్గి 45,178 రూపాయలకు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఔన్సుకు వరుసగా 1,458 డాలర్లు, 16.86 డాలర్లుగా ట్రేడవుతున్నాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాల నేపథ్యంలో 1,460 డాలర్ల దిగువకు చేరుకున్నట్లు పటెల్ తెలిపారు.
ఇదీ చూడండి: పెట్రో మంట మళ్లీ షురూ... ఏడాది గరిష్ఠానికి ధరలు