తెలంగాణ

telangana

ETV Bharat / business

కాస్త దిగొచ్చిన బంగారం, వెండి ధరలు - బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు గురువారం కాస్త తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తిడి ధర రూ.51,500 దిగువకు చేరింది. వెండి ధర కిలోకు రూ.500 లకు పైగా దిగొచ్చింది.

gold price decline
తగ్గిన బంగారం ధర

By

Published : Oct 22, 2020, 4:40 PM IST

బంగారం ధర గురువారం స్వల్పంగా రూ.95 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.51,405 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ తగ్గటం, గురువారం.. రూపాయి స్వల్పంగా పుంజుకోవడం వంటి పరిణామాలు దేశీయంగా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.

పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు రూ.504 (దిల్లీలో) తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.63,425 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,918 డాలర్లకు దిగొచ్చింది. వెండి ధర ఔన్సుకు 24.89 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:ఆశాజనకంగా 'రియల్టీ' భవిష్యత్ అంచనాలు

ABOUT THE AUTHOR

...view details