తెలంగాణ

telangana

ETV Bharat / business

పసిడికి రెక్కలు- రికార్డు స్థాయికి చేరిన ధర

బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే 10 గ్రాముల పసిడి ధర రూ. 250 పెరిగి 40, 220 వద్ద ముగిసింది. కిలో వెండి ధర 50వేల మార్కును తాకి రూ. 200 పెరుగుదలతో 49, 050 వద్ద స్థిరపడింది.

By

Published : Aug 29, 2019, 8:31 PM IST

Updated : Sep 28, 2019, 7:05 PM IST

రికార్డు స్థాయికి పసిడి ధర

బంగారం ధర చుక్కలనంటుతోంది. బుధవారం రూ. 300 పెరిగి 39, 970గా నమోదైన పసిడి... నేడు మరో రూ. 250 పెరిగి తొలిసారిగా రికార్డు స్థాయిలో 40వేల మార్కు దాటింది. పుత్తడి ధర రూ. 40,220 వద్ద ముగిసిందని అఖిల భారత సరాఫా అసోసియేషన్ ప్రకటించింది.

పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీ యూనిట్ల నుంచి వస్తోన్న డిమాండ్​తో కిలో వెండి ధర రూ. 200 పెరిగి...రూ. 49050 వద్ద ముగిసింది.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్య భయాలు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై అనిశ్చితుల నేపథ్యంలో మదుపరులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. పండుగలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పసిడి ధర ఆకాశాన్ని అంటుతోంది. రూపాయి విలువ బలహీనపడటం బంగారం ధర పెరగడానికి కారణంగా తెలుస్తోంది.

"బ్రెగ్జిట్​పై భవిష్యత్​లో జరగనున్న నిర్ణయాలు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలు, అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఆర్థిక విధానం భవిష్యత్తులో బంగారం ధరలను నిర్ణయిస్తాయి."

-తపన్​ పటేల్, హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ విశ్లేషకుడు

అంతర్జాతీయ విపణిలోనూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. న్యూయార్క్​లో ఔన్సు బంగారం ధర 1539 అమెరికన్​ డాలర్లుగా ఉంది. వెండి 1.15 శాతం పెరిగి 18.63 డాలర్లుగా స్థిరపడింది.

ఇదీ చూడండి: చిదంబరం అరెస్టుపై ఇంద్రాణి ముఖర్జీ హర్షం

Last Updated : Sep 28, 2019, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details