తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన పసిడి ధర- తగ్గిన వెండి - బంగారం ధర

దేశీయంగా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.97 పెరిగింది. కిలో వెండి ధర రూ.275 తగ్గి.. రూ.66,253కు చేరింది.

Gold and Silver price
బంగారు, వెండి ధరలు

By

Published : Apr 9, 2021, 4:03 PM IST

బంగారం ధర శుక్రవారం స్వల్పంగా పెరగగా.. వెండి ధరలో తగ్గుదల నమోదైంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.97 వృద్ధి చెంది.. రూ.46,257కు చేరింది.

కిలో వెండి ధర రూ.275 క్షీణించి.. రూ.66,253కు తగ్గింది.

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ తగ్గడమే దేశీయంగా పసిడి ధర పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,745 డాలర్లు, వెండి ధర 25.15 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:వెంటాడిన కరోనా భయాలు- మార్కెట్లకు నష్టాలు

ABOUT THE AUTHOR

...view details