తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర - నేటి బంగారం, వెండి ధరలు

దిల్లీలో 10 గ్రాముల బంగారం రూ.39,630గా, కిలో వెండి ధర రూ.48,060గా ఉంది. వివాహాది శుభకార్యాలకు డిమాండ్​ పెరగడం, అంతర్జాతీయ ప్రభావం కారణంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.

Gold climbs Rs 116 tracking strong global trends
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

By

Published : Dec 26, 2019, 4:57 PM IST

బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ ప్రకారం.. దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.116 పెరిగి రూ.39,630గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్స్​ బంగారం ధర 1,504 డాలర్లకు చేరింది.

అంతర్జాతీయ ప్రభావంతో పాటు వివాహాది శుభకార్యాల కోసం 24 క్యారెట్ల బంగారానికి డిమాండ్​ పెరుగుతున్న నేపథ్యంలోనే పసిడి ధరలు పెరుగుతున్నాయని హెచ్​డీఎఫ్​సీ అనలిస్ట్ (కమొడిటీస్​) తపన్​ పటేల్ చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్​లో

కిలో వెండి ధర నిన్నటితో పోల్చితే రూ.454 పెరిగి రూ.48,060గా ఉంది. ఔన్స్​ వెండి ధర 17.94 డాలర్లకు పెరిగింది.

రాజకీయ అనిశ్చితులు, క్రిస్మస్​, నూతన సంవత్సర సెలవులు ఉండటం.. 2020 ప్రారంభంలో ఈక్విటీ సూచీలు లాభపడతాయనే అంచనాలతో గ్లోబల్​ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారని తపన్ తెలిపారు.

ఇదీ చూడండి:ఎఫ్​ అండ్​ ఓ గడువు ముగిసింది.. మార్కెట్​ నష్టపోయింది


ABOUT THE AUTHOR

...view details