కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో బంగారం వ్యాపారంపై(gold business in india) తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో పసిడి విక్రయాల్లో సరికొత్త ఆలోచనలకు పురుడుపోస్తున్నారు ఆభరణాల వ్యాపారులు. ఆన్లైన్ ద్వారా(digital gold) కేవలం ఒక డాలర్‌కు బంగారాన్ని విక్రయించటం ప్రారంభించారు.
కరోనా సంక్షోభం(Corona crisis) నుంచి తేరుకునేందుకు.. టాటా గ్రూప్ తనిష్క్(digital gold tanishq ), కల్యాణ్ జువెలర్స్ ఇండియా, పీసీ జువెలర్స్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్.. కేవలం రూ.100కు(1.53 డాలర్లు) చిన్న పరిమాణంలో బంగారాన్ని విక్రయించే ఆఫర్స్ ప్రకటించాయి. ఆన్లైన్ ద్వారా(Gold sales online) లేదా వాటి అధికారిక వెబ్సైట్ల ద్వారా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. అలాగే.. డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్స్‌తో భాగస్వామ్యంతోనూ అమ్మకాలు చేపట్టాయి. అయితే.. కనీసం ఒక గ్రాము పసిడికి సరిపడా నగదు జమ అయిన తర్వాతే వినియోగదారులకు డెలివరీ చేస్తారు.
కొత్తేమీ కాదు..!
డిజిటల్ గోల్డ్ విక్రయాలు భారత మార్కెట్లో(gold business in india) కొత్తేమీ కాదు. ఆగ్మాంట్ గోల్డ్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఆధారిత సేఫ్గోల్డ్.. ఇలాంటివి గతంలో చేపట్టాయి. అయితే.. బంగారం కొనుగోళ్లు వ్యక్తిగతంగా జరుగుతన్న నేపథ్యంలో.. ఆభరణాల వ్యాపారులు ఎక్కువ శాతం ఆన్లైన్ విక్రయాలకు(digital gold) దూరంగా ఉన్నారు.
యువతపై ప్రత్యేక దృష్టి..
భారత్‌లో ప్రస్తుతం పండుగలు, పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. బంగారం డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో కొత్త కొత్త ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వ్యాపారులు. కొద్ది కాలంగా ఆన్లైన్ ద్వారా(Gold sales online) బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నందున.. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు దాదాపుగా ఆభరణాల వ్యాపారులు అందరూ ఆన్లైన్ బాటలో పయనిస్తున్నారు.