తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - gold rates in hyderabad

బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి. అయితే, వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

gold silver prices today in andhra pradesh telangana
భారీగా పెరిగిన బంగారం ధర

By

Published : Aug 12, 2021, 11:03 AM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.278 మేర పెరిగింది. అయితే, వెండి మాత్రం కాస్త పతనమైంది. కేజీ వెండి రూ.55 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

  • హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,960కి చేరింది.
  • ఈ నగరాల్లో కేజీ వెండి ధర రూ.64,845గా ఉంది.
  • స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1752 డాలర్లుగా నమోదైంది.
  • స్పాట్ సిల్వర్ ధర 23.49 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఏపీ, తెలంగాణలో ఇంధన ధరలు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ రూ.105.58 వద్ద, డీజిల్​ లీటర్​ రూ.98.01 వద్ద ఉన్నాయి.
  • గుంటూరులో లీటర్​ డీజిల్ రూ.99.65 వద్ద ఉండగా.. పెట్రోల్​ లీటర్​ రూ.108.06గా ఉంది.
  • వైజాగ్​లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్​కు వరుసగా.. రూ.106.86, రూ. 98.49గా వద్ద ఉన్నాయి.

ఇదీ చదవండి:బిలియన్​ డాలర్ల సమీకరణే లక్ష్యంగా ఐపీఓకు ఫార్మ్​ఈజీ!

ABOUT THE AUTHOR

...view details