తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బంగారం ధర (Gold Rate Today) స్వల్పంగా పెరిగింది. గురువారం రూ.211 మేర పెరిగి.. పది గ్రాముల మేలిమి బంగారం ధర ప్రస్తుతం రూ.49,590గా ఉంది. వెండి ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకోగా.. కిలో వెండి ధర (Silver price today)రూ.22 తగ్గి.. రూ.66,474కు చేరింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.49,590గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,474కి చేరింది.
- విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు (Gold Price in Vijayawada) రూ.49,368 వద్ద ట్రేడవుతోంది. కేజీ వెండి ధర రూ.66,474 వద్ద కొనసాగుతోంది.
- విశాఖపట్నంలో బంగారం ధర (Gold Price in Vizag) పది గ్రాములకు రూ.49,590గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,474 వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయంగా.. 12
అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 11 డాలర్లు పెరిగి.. రూ.1801 డాలర్లుగా ట్రేడవుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.06 డాలర్లు పలుకుతోంది.