ప్రస్తుత ఆర్థిక సంవత్సర క్యూ3 ఫలితాల ప్రకటన దాదాపుగా ముగిసింది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లపై ఈ వారం అంతర్జాతీయ పరిణామాల ప్రభావమే కీలకంగా ఉండనుందని విశ్లేషకులు అంటున్నారు. విదేశీ మదుపరుల స్పందన, దేశీయ మదుపరుల సెంటిమెంట్ మార్కెట్లను ముందుకు నడిపించనున్నట్లు చెబుతున్నారు.
సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చేలా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మార్కెట్లు ఇటీవల భారీగా పుంజుకున్నాయి. ఫలితంగా కొంత ఏకీకరణకు అవకాశం ఉన్నట్లు జియోజిత్ ఫినాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ అంచనా వేస్తున్నారు.