ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ రుణాలు రికార్డు స్థాయి వద్ద 100 శాతం దాటొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించింది. 2020లో మొత్తం మీద సగటు ద్రవ్యలోటు కూడా జీడీపీలో 14 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. మునుపెన్నడూ చూడనంత వేగంగా ప్రభుత్వ రుణాలు జీవనకాల గరిష్ఠాలకు చేరొచ్చని తెలిపింది.
ద్రవ్యలోటు పెరిగేందుకు కారణాలు..
కరోనా కారణంగా ఉత్పత్తి తగ్గడానికి తోడు.. ప్రభుత్వ ఆదాయాలు కూడా క్షీణించడం వల్ల ప్రభుత్వ రుణాలు, ద్రవ్య లోటు పెరగవచ్చని ఐఎంఎఫ్ ద్రవ్య వ్యవహారాల విభాగ డైరెక్టర్ విటర్ గాస్పర్ తెలిపారు.
2020-21 ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ రుణాలు.. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 20 పర్సెంటీజే పాయింట్లు పెరిగినట్లవుతుందని అన్నారు.