తెలంగాణ

telangana

ETV Bharat / business

డేటింగ్ యాప్​ కోసం అంత ఖర్చా...?

గూగుల్​, యాపిల్​ స్టోర్ల ఆదాయం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 15 శాతం పెరిగింది. యాపిల్​ యాప్​ స్టోర్​ 25.5 బిలియన్​ డాలర్ల రెవెన్యూ సాధించగా.. 14.2 బిలియన్​ డాలర్లు ఆర్జించింది గూగుల్​ ప్లే స్టోర్​. డేటింగ్​ యాప్​ టిండర్​ ఆదాయం విషయంలో అగ్రస్థానంలో నిలిచింది.

డేటింగ్ యాప్​ కోసం అంత ఖర్చా?

By

Published : Jul 14, 2019, 11:05 AM IST

యాపిల్​, గూగుల్​ యాప్​ స్టోర్లు 2019 మొదటి సగ భాగంలో భారీగా ఆర్జించాయి. ఈ ఆరు నెలల్లో యాపిల్​ యాప్​ స్టోర్​, గూగుల్​ ప్లే స్టోర్​ 39.7 బిలియన్​ డాలర్లు సంపాదించాయి. గతేడాది (34.4 బిలియన్​ డాలర్లు)తో పోలిస్తే 15.4 శాతం వృద్ధి సాధించాయని మొబైల్​ యాప్​ ఇంటెలిజెన్స్​ నివేదిక పేర్కొంది.

యాపిల్​దే పైచేయి

యాపిల్​ యాప్​ స్టోర్​లోనే వినియోగదారులు అత్యధికంగా ఖర్చు పెట్టారు. ఈ 6 నెలల్లో 25.5 బిలియన్​ డాలర్లు అర్జించింది. గూగుల్​ ప్లే మాత్రం 14.2 బిలియన్​ డాలర్లతో సరిపెట్టుకుంది.

యాప్​లలో..

గేమింగ్​యేతర యాప్​లలో డేటింగ్​ యాప్​ 'టిండర్'​ అత్యధికంగా సంపాదించింది. ఈ రెండు స్టోర్ల ద్వారా 497 మిలియన్​ డాలర్లతో గతేడాది కన్నా 32 శాతం వృద్ధి నమోదు చేసింది.

తర్వాత నెట్​ఫ్లిక్స్ 399 బిలియన్​ డాలర్లతో రెండో స్థానంలో​ నిలిచింది. ఐఓఎస్​ వెర్షన్​ యాప్​లో సబ్​స్క్రిప్షన్ తొలగింపు నిర్ణయంతో రెండో త్రైమాసికంలో నెట్​ఫ్లిక్స్​ ఆదాయం కొంతమేర తగ్గింది.

డౌన్​లోడ్​లలో వాట్సాప్​

అత్యధికంగా డౌన్​లోడ్​ చేసుకున్న యాప్​లలో ఫేస్​బుక్​తో పాటు ఆ సంస్థకు చెందిన వాట్సాప్​, మెసెంజర్​ మొదటి 3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇన్​స్టాగ్రామ్​ను వెనక్కునెట్టిన టిక్​టాక్​ నాలుగో స్థానంలో స్థిరపడింది.

నిషేధంతో మరింత పైకి..

బీజింగ్​ ఆధారిత అంకుర సంస్థ బైట్​డ్యాన్స్​కు చెందిన టిక్​టాక్​కు ఈ ఏడాది కొత్త డౌన్​లోడ్లు 28 శాతం పెరిగాయి. భారత్​లో రెండు వారాలు నిషేధాన్ని ఎదుర్కొన్నా ప్రపంచ వ్యాప్తంగా 34.4 కోట్ల మంది ఈ వీడియో యాప్​ను అక్కున చేర్చుకన్నారు.

ఇదీ చూడండి: 'పబ్​జీ లైట్'​ ఆడితే.. జియో రివార్డుల పంట!

ABOUT THE AUTHOR

...view details