Gennova vaccine DCGI: పుణె కేంద్రంగా పనిచేసే జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా పరిశీలించనుంది. ఎంఆర్ఎన్ఏ ఆధారిత ఈ టీకాకు సంబంధించిన ట్రయల్స్ వివరాలను సంస్థ అధికారులు.. డీసీజీఐకి చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ(ఎస్ఈసీ)కి అందించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Gennova Vaccine Trials
ఈ టీకా ఫేజ్ 2 ట్రయల్స్ డేటాను సంస్థ పంపిందని అధికారులు తెలిపారు. మూడో దశ ట్రయల్స్ కోసం వలంటీర్ల ఎంపిక ప్రక్రియను జెన్నోవా పూర్తి చేసినట్లు చెప్పారు.
ఒమిక్రాన్ వేరియంట్‌పై పనిచేసే విధంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను జెన్నోవా బయోఫార్మా అభివృద్ధి చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. త్వరలోనే మానవులపై ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు వెల్లడించాయి.
వ్యాక్సినేషన్...
మరోవైపు, దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఆదివారం 39,46,348 మందికి టీకా అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,57,20,41,825కు చేరింది. వృద్ధులు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ప్రికాషన్ డోసులతో పాటు.. టీనేజర్లకు టీకాలు అందిస్తున్నారు.
ఇదీ చదవండి:Covid cases in India: దేశంలో కొత్తగా 2.58లక్షల కరోనా కేసులు