తెలంగాణ

telangana

ETV Bharat / business

జనరల్​ మోటార్స్​ కార్మికుల సమ్మె బాట - సమ్మె

వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత వంటి డిమాండ్లతో జనరల్​ మోటార్స్​ కార్మికులు అమెరికావ్యాప్తంగా సమ్మె బాట పట్టారు. ఫలితంగా వాహనాల ఉత్పత్తి, పంపిణీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

జనరల్​ మోటార్స్​ కార్మికుల సమ్మె బాట

By

Published : Sep 16, 2019, 3:19 PM IST

Updated : Sep 30, 2019, 8:10 PM IST

దిగ్గజ ఆటోమొబైల్‌ సంస్థ జనరల్‌ మోటార్స్‌కు చెందిన కార్మికులు అమెరికావ్యాప్తంగా సమ్మె బాట పట్టారు. వేతనాలు, ఇతర విషయాలపై చర్చల్లో ఏర్పడిన ప్రతిష్టంభనతో దాదాపు 49 వేల మంది కార్మికులు విధులు బహిష్కరించారు. ఈ సమ్మెతో అమెరికావ్యాప్తంగా 9 రాష్ట్రాల్లోని 33 ఉత్పత్తి కేంద్రాల్లో, 22 పంపిణీ కేంద్రాల్లో పనులు నిలిచిపోయాయి.

జనరల్​ మోటార్స్​ కార్మికుల సమ్మె బాట

వేతనాలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు, తాత్కాలిక కార్మికులు, ఉద్యోగ భద్రతపై జనరల్​ మోటార్స్​కు, కార్మికులు చేసుకున్న నాలుగేళ్ల కాంట్రాక్టుకు కాలం చెల్లింది. కొత్త ఒప్పందం కుదుర్చుకోవడంపై చర్చలు సఫలం కాలేదు. ఫలితంగా సమ్మెకు దిగారు కార్మికులు.

2007లో రెండు రోజుల పాటు విధుల బహిష్కరించిన తర్వాత జనరల్ మోటార్స్​ కార్మికులు దేశవ్యాప్త సమ్మెను ప్రకటించడం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి:బాంబుదాడులు జరుపుతామని జైషే బెదిరింపు లేఖ!

Last Updated : Sep 30, 2019, 8:10 PM IST

ABOUT THE AUTHOR

...view details