తెలంగాణ

telangana

ETV Bharat / business

జియోలో మరో ప్రముఖ సంస్థ రూ.6598 కోట్ల పెట్టుబడి

అమెరికాకు చెందిన జనరల్ అట్లాంటిక్ జియో ప్లాట్​పామ్​ల్లో రూ.6,598.38 కోట్లు పెట్టుబడి పెట్టడానికి నిశ్చయించింది. ఫలితంగా జియోలో ఆ సంస్థ 1.34 శాతం వాటాను దక్కించుకోనుంది. జియోలో ఇప్పటికే ఫేస్​బుక్, సిల్వర్ లేక్, విస్టా లాంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టాయి.

General Atlantic pics 1.34 pc stake in Jio platforms for Rs 6,598.38 cr
జియోలో జనరల్ అట్లాంటిక్ రూ.6598 కోట్ల పెట్టుబడి

By

Published : May 17, 2020, 5:40 PM IST

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోలోకి విదేశీ సంస్థల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన జనరల్ అట్లాంటిక్.. జియో ప్లాట్​పామ్​ల్లో రూ. 6,598.38 కోట్లు పెట్టుబడి పెట్టడానికి నిశ్చయించింది. ఫలితంగా ఆ సంస్థ 1.34 శాతం వాటాను దక్కించుకోనుంది. ఆసియాలో ఆ సంస్థ పెట్టిన అతి పెద్ద పెట్టుబడి ఇదే.

జియోలో ఇప్పటికే ఫేస్​బుక్, సిల్వర్ లేక్ పార్టనర్స్ , విస్టా లాంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టగా... తాజాగా జనరల్ అట్లాంటిక్ ఈ జాబితా చేరింది.

జియోలో ఫేస్​బుక్ రూ.43,574 కోట్లతో 9.99 శాతం వాటా, సిల్వర్ లేక్ రూ.5,655.75 కోట్లతో 1.15 శాతం వాటా, విస్టా రూ.11,367 కోట్లతో 2.3 శాతం వాటాను కొనుగోలు చేశాయి. ఇప్పటి వరకు జియో రూ.67,194.75 కోట్ల పెట్టుబడులను సమీకరించగలిగింది. ఈ పెట్టుబడులు నెక్స్ట్​ జెనరేషన్​ సాఫ్ట్​వేర్ ప్రొడక్ట్, ప్లాట్​ఫాం కంపెనీగా జియోను తీర్చిదిద్దుతాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి:దేశంలో 13.6 కోట్ల ఉద్యోగాలకు కరోనా గండం

ABOUT THE AUTHOR

...view details