తెలంగాణ

telangana

ETV Bharat / business

నీతా, అదానీ, బిర్లాలకు దాతృత్వంలో అగ్రస్థానం

ప్రపంచవ్యాప్తంగా దాతృత్వ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అగ్రగామి 100 మంది భారత వ్యాపార దిగ్గజాల్లో గౌతమ్‌ అదానీ, నీతా అంబానీ, కుమార మంగళం బిర్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అమెరికాకు చెందిన వలస సంఘం 'ఇండియాస్పోరా' తొలిసారిగా ఈ జాబితాను తొమ్మిది మంది జూరీ సభ్యుల మార్గదర్శకత్వంలో పలు అంశాల ఆధారంగా దీనిని రూపొందించింది.

Nita Ambani, Gautam Adani, Birla
నీతా, అదానీ, బిర్లా

By

Published : Aug 14, 2021, 5:51 AM IST

ప్రపంచవ్యాప్తంగా దాతృత్వ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అగ్రగామి 100 మంది భారత వ్యాపార దిగ్గజాల్లో గౌతమ్‌ అదానీ, నీతా అంబానీ, కుమార మంగళం బిర్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అమెరికాకు చెందిన వలస సంఘం 'ఇండియాస్పోరా' తొలిసారిగా ఈ జాబితాను తొమ్మిది మంది జూరీ సభ్యుల మార్గదర్శకత్వంలో పలు రకాల, విశ్వసనీయమైన వర్గాలు, పత్రాలు, పరిశోధనల ఆధారంగా దీనిని రూపొందించింది.

ఈ జాబితాలో భారత్‌ నుంచి గౌతమ్‌ అదానీ, నీతా అంబానీ, కుమార మంగళం బిర్లా.. అమెరికా నుంచి మాంటే అహూజా, అజయ్‌ బంగా, మనోజ్‌ భార్గవ; కెనడా నుంచి సోనమ్‌ అజ్మేరా, బాబ్‌ థిల్లాన్‌, ఆదిత్య ఝా; బ్రిటన్‌ నుంచి మొహమ్మద్‌ అమర్సి, మనోజ్‌ బాదలే, కుజిందర్‌ బహియాలు అగ్రస్థానంలో నిలిచారు. భారత్‌లోని ప్రముఖులు తమ విజయాల ప్రభావాన్ని, దాతృత్వం ద్వారా సమాజానికి మేలు చేసేందుకు వినియోగిస్తుండటం అత్యంత స్ఫూర్తిదాయకమని ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు ఎమ్‌.ఆర్‌. రంగస్వామి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఎయిర్‌టెల్‌- జియో డీల్‌ పూర్తి.. టెలికాం చరిత్రలో ఇదే తొలిసారి!

ABOUT THE AUTHOR

...view details