తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువు పెంపు - FY19 ITR filing deadline extended

2018- 19 ఏడాదికి గాను ఐటీ రిటర్ను దాఖలు గడువును 2020 జులై 31 వరకు పొడిగించింది కేంద్రం. ఆధార్​- పాన్​ అనుసంధానానికి కూడా 2021 మార్చి 31 వరకు సమయం ఇచ్చింది.

BIZ-ITR-DEADLINE
ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు

By

Published : Jun 24, 2020, 9:55 PM IST

పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేలా రిటర్ను దాఖలు చేయడానికి గడువు పొడిగించింది కేంద్రం. 2018- 19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువును జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది.

ఆధార్- పాన్​ అనుసంధానం..

ఆధార్​తో పాన్​ అనుసంధానం గడువును కూడా పొడిగించింది కేంద్రం. 2021 మార్చి 31 వరకు అవకాశాన్ని కల్పించింది. వీటితో పాటు 2019-20 లో ఐటీ చట్టం ప్రకారం తగ్గింపులను క్లెయిమ్ చేయడానికి వివిధ పెట్టుబడుల కాలపరిమితిని జూలై 31, 2020 వరకు పొడిగించింది.

2019- 20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్ను దాఖలు గడువును నవంబర్​ 30 వరకు పొడిగించినట్లు ఇప్పటికే ప్రకటించింది సీబీడీటీ.

ABOUT THE AUTHOR

...view details