తెలంగాణ

telangana

ETV Bharat / business

"స్వయంగా ప్రధానే నన్ను నిర్దోషంటున్నారు​" - ఆర్థిక నేరారోపణలు

పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... భాజపా పాలనలో తాను ఓ 'పోస్టర్​ బాయ్​'లా మారానన్నారు. భారత బ్యాంకులకు తాను చెల్లించాల్సిన మొత్తం కంటే ఎక్కువగానే... తిరిగి రాబట్టామని మోదీ చేసిన ప్రకటనకు స్పందనగా మాల్యా ట్వీట్​ చేశారు.

విజయ్​ మాల్యా

By

Published : Mar 31, 2019, 7:33 PM IST

ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్​ కింగ్​ విజయ్​ మాల్యా.. ప్రధాని ప్రకటనే తనను నిర్దోషి అని అంటోందని ఉటంకించారు. భాజపా పాలనలో తాను ఓ పోస్టర్​ బాయ్​గా మారానని అభివర్ణించారు.

ఇటీవల రూ. 14,000 కోట్ల విలువైన విజయ్​ మాల్యా ఆస్తులను ప్రపంచ వ్యాప్తంగా జప్తు చేసినట్టు ఓ ఇంటర్వ్యూలో ప్రధాన మంత్రి మోదీ వెల్లడించారు. మాల్యా చెల్లించాల్సిన దానికంటే ఎక్కువగానే తిరిగి రాబట్టామని... దీంతో మాల్యా ఇబ్బందుల్లో పడ్డారని అన్నారు.

ఈ అంశంపై తనదైన శైలిలో ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు విజయ్​ మాల్యా.

ట్విట్టర్​లో విజయ్​ మాల్యా

"నేను నమ్రతగా నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాను. బ్యాంకులకు నేను చెల్లించాల్సిన రూ.9,000 కోట్ల కంటే ఎక్కువగానే తమ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని... ప్రధాన మంత్రే ప్రకటించారు"

-ట్విట్టర్​లో విజయ్​ మాల్యా

నేను 1992 నుంచి బ్రిటన్​ వాసిగా ఉన్న విషయం వాస్తవం. కానీ నేను పారిపోయానని భాజపా తప్పుడు అభియోగాలు మోపుతోందని మాల్యా పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details