దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని డొమినికా పోలీసులు పట్టుకున్నారు. ఈ కుంభకోణం తరువాత చోక్సీ ఆంటిగ్వా, బార్బుడాకి పారిపోయారు. అక్కడ నుంచి క్యూబా పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే చోక్సీపై ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేసింది.
ఇంటర్‌పోల్‌కు సంబంధించిన ఎల్లో నోటీసు జారీ చేసిన తరువాత డొమినికాలోని పోలీసులు మంగళవారం చోక్సీని పట్టుకున్నారు. ఆపై ఆయన్ని రాయల్ పోలీస్ ఫోర్స్ ఆఫ్ ఆంటిగ్వా, బార్బుడాకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానిక మీడియా పేర్కొంది.