మళ్లీ పెట్రో బాదుడు- ఈ నెలలో పన్నెండోసారి
దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.93.21కి చేరింది.
దేశంలో మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
దేశంలో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 13 నుంచి 29 పైసల మేర పెంచుతూ చమురు పంపిణీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
- దిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెంపు
- దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.93.21, డీజిల్ రూ.84.07
- ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.99.49, డీజిల్ రూ.91.30
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 18 పైసలు, డీజిల్‌పై 29 పైసలు పెంపు
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.96.88, డీజిల్ రూ.91.65
- ఈ నెలలో ఇప్పటివరకు 12 సార్లు పెరిగిన చమురు ధరలు
- ఈనెలలో ఇప్పటివరకు పెట్రోల్‌పై రూ.2.81, డీజిల్‌పై రూ.3.34 పెంపు