తెలంగాణ

telangana

ETV Bharat / business

Petrol price: ఆగని పెట్రో ధరల పెంపు - దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర

దేశంలో పెట్రో మోత మోగింది. మరోసారి చమురు ధరలను (oil prices)పెంచుతూ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈనెలలోనే 14 సార్లు ధరలు పెరగడం గమనార్హం. తాజాగా లీటరు పెట్రోల్​పై 18పైసలు, లీటరు డీజిల్​పై 31పైసలు పెరిగింది.

Fuel prices hiked across metros, petrol crosses Rs 93 in Delhi
పెట్రో మోత.. మరోసారి ధరల పెంపు

By

Published : May 27, 2021, 8:10 AM IST

దేశంలో పెట్రో బాదుడు ఆగటం లేదు. ఇప్పటికే ఈనెలలో 14 సార్లు చమురు ధరలు పెరగ్గా.. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 18 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెంచుతూ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గడచిన 14 రోజుల్లో పెట్రోల్‌పై రూ.3.28, డీజిల్‌పై రూ.3.88 పెరిగింది.

100 దాటిన పెట్రోల్​(petrol) ధర!

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.97.52, డీజిల్ రూ.92.39 ఉండగా.. దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.93.68, డీజిల్ రూ.84.61గా నమోదయ్యాయి. ఇక ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.99.94, డీజిల్ రూ.91.87 లభిస్తుండగా.. రాజస్థాన్ జైపుర్‌లో లీటర్ పెట్రోలు ధర రూ.100 దాటింది.

ఇవీ చదవండి:'సామాన్యుల నడ్డి విరిచేలా పెట్రో ధరలు.. ఇది సరైందా?'

ABOUT THE AUTHOR

...view details