తెలంగాణ

telangana

ETV Bharat / business

దేశంలో పెరిగిన ఇంధన విక్రయాలు.. కారణం ఇదే!

Fuel price hike: భారత్​లో ఇంధన విక్రయాలు భారీగా పెరిగాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉంటుందని భావించిన వినియోగదారులు, డీలర్లు భారీ సంఖ్యలో ట్యాంక్‌లలో ముందస్తుగా నింపిపెట్టుకున్నారు. దీంతో దేశంలో ఇంధన అమ్మకాలు కొవిడ్​ సమయంతో పోల్చితే భారీగా పెరిగాయి.

By

Published : Mar 16, 2022, 10:27 PM IST

Price hike expectation drives petrol, diesel sales
భారత్‌లో పెరిగిన ఇంధన విక్రయాలు.. కారణం ఇదే!

Fuel price hike: ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయని వినియోగదారులు, డీలర్లు పెద్ద ఎత్తున చమురుని కొనుగోలు చేశారు. దీంతో భారత్‌లో ఇంధన విక్రయాలు కరోనా రాక ముందుతో పోలిస్తే క్రమంగా పెరిగిపోయాయి. గత ఏడాది మార్చి 1 నుంచి 15 వరకు పోలిస్తే ఈ ఏడాది పెట్రోల్ అమ్మకాలు 18 శాతం పెరగగా డీజిల్ 23.7 శాతం పెరిగాయి.

2020 తో పోలిస్తే పెట్రోలు 24. 3 శాతం, డిజీల్ 33.5 శాతం విక్రయాలు పెరిగాయి. ఇటీవల రాహుల్ గాంధీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయని ముందుగానే ట్యాంకులు నింపుకోవాలంటూ వినియోగదారులకి సూచించారు. దీనివల్ల ఇంధన విక్రయాలు 20 శాతం పెరిగాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి రాహుల్‌పై విమర్శలు గుప్పించారు.

గత ఏడాది నవంబరులో 5 రాష్ట్రాల ఎన్నికల సందడి మొదలవ్వడంతో ఇంధన ధరలు పెరిగినప్పటికి అదుపులోనే ఉంచారు. ముడి చమురు ధర బ్యారెల్‌కి 81 డాలర్ల నుంచి 131 డాలర్లు కి ఎగబాకగా దాదాపు 132 రోజులు ఇంధన ధరలను నియంత్రణలో పెట్టారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని చాలా మంది అనుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ చమురు ధరలు ఒక బ్యారెల్‌కి 100 డాలర్లు ఉన్నట్లు కేంద్ర మంత్రి హరిదీప్‌ సింగ్ పూరి తెలిపారు.

ఇదీ చూడండి:

భారీగా పెరిగిన విమాన ఇంధన ధరలు.. కిలోలీటర్​ రూ.లక్ష పైనే..

ABOUT THE AUTHOR

...view details