రెండు రోజుల విరామం అనంతరం.. ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో.. లీటరు పెట్రోలుపై 25 పైసలు, లీటరు డీజిల్‌పై 35 పైసలు పెరిగింగి.
రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ 'పెట్రో బాదుడు'
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, లీటరు డీజిల్‌పై 35 పైసలు పెంచారు.
మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
దీంతో.. లీటరు పెట్రోలు ధర రూ. 90.83కి చేరగా, లీటరు డీజిల్ రూ.81.32కు పెరిగింది. ముంబయిలో లీటరు పెట్రోలు ధర రూ.97.34, లీటరు డీజిల్ ధర రూ. 88.44గా నమోదయ్యాయి. పెట్రో బాదుడు ఈనెలలో ఇది 15వ సారి కాగా, చమురు సంస్థలు గత 54 రోజుల్లో 25 సార్లు ధరలు పెంచాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఇంధన ధరలను సంస్థలు రూ.7.50 పెంచాయి.
ఇదీ చదవండి :హరియాణాలో రైతు నేతపై కాల్పులు
Last Updated : Feb 23, 2021, 8:18 AM IST