ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) చెక్‌బుక్‌లు పనిచేయవని స్పష్టం చేసింది. ఈ బ్యాంకుల ఖాతాదారులు కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవాలంటూ ట్విటర్ వేదికగా వెల్లడించింది.
గతేడాది ఏప్రిల్‌లో ఓబీసీ, యూబీఐ బ్యాంకులను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అయితే విలీనమైనప్పటికీ ఇప్పటివరకు పాత చెక్‌బుక్‌లనే కొనసాగించారు. అయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆ చెక్‌బుక్‌లు పనిచేయబోమని పీఎన్‌బీ తాజాగా వెల్లడించింది. ఈ బ్యాంకుల ఖాతాదారులు వీలైనంత త్వరగా పీఎన్‌బీ ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్‌లతో ఉన్న కొత్త చెక్‌బుక్‌లను తీసుకోవాలని తెలిపింది.