తెలంగాణ

telangana

ETV Bharat / business

2021లో హవా అంతా ఎలక్ట్రిక్​ కార్లదే! - ఆడి ఈ-ట్రాన్​ ఫీచర్లు..

భారత్​లో విద్యుత్​ వాహనాల(ఈవీలు) వినియోగం.. 2021లో మరింత పెరిగేలా కనిపిస్తోంది. అనేక కార్ల కంపెనీలు తమ ఈవీలను భారత మార్కెట్​లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ ఏడాదిలో రానున్న విద్యుత్​ కార్లు ఏంటో? వాటి ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

2021లో హవా అంతా ఎలక్ట్రిక్​ కార్లదే!
2021లో హవా అంతా ఎలక్ట్రిక్​ కార్లదే!

By

Published : Jan 3, 2021, 2:07 PM IST

గాలి నాణ్యత దెబ్బతినడానికి అనేక కారణాలున్నా.. వాహన కాలుష్యం అన్నది అతిపెద్ద సమస్యగా మారింది. అందుకే ఇప్పుడు అనేక కంపెనీలు... విద్యుత్​ వాహనాల(ఈవీ) తయారీ దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశంలో ఈవీల వినియోగంపై​ ఇప్పుడిప్పుడే అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. 2020లో ఎమ్​జీ జెడ్​ఎస్​ ఈవీ, టాటా నెక్సాన్​ ఈవీ వంటి వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.

అధికారిక ప్రకటన ఇంతవరకు ఏమీ రాకపోయినప్పటికీ.. చాలా కంపెనీలు ఈ ఏడాదిలో మరిన్ని ఈవీలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. టాటా, మహీంద్ర నుంచి మారుతీ వరకు వివిధ కార్ల తయారీ సంస్థలు తమ ఈవీలతో భారత మార్కెట్లలో ఈసారి పోటీ పడనున్నాయి. 2021లో విడుదల కానున్న కొన్ని ప్రముఖ సంస్థల విద్యుత్​ కార్ల ఫీచర్లేంటో ఇప్పుడు చూసేద్దాం.

టాటా ఆల్ట్రోజ్​ ఈవీ...

దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్​.. తన ఆల్ట్రోస్​ సిరీస్​లో భాగంగా.. ఈసారి ఈవీని తీసుకురానుంది. త్వరలోనే దీన్ని భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. లాంచ్​ తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ.. ఈ ఏడాది తొలిభాగంలోనే ఈ వాహనం విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఫీచర్లు

  • ఐపీ67 డస్ట్​ ప్రూఫ్​ బ్యాటరీ
  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 312 కి.మీ ప్రయాణ సామర్థ్యం
  • ధర అంచనా- రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు

ఆడి ఈ-ట్రాన్​

విలాసవంతమైన కార్లకు పేరుగాంచిన కార్ల ఉత్పత్తి సంస్థ ఆడి. 2021లో ఈ సంస్థ కూడా తన ఈవీని భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు భారత్​లో సంస్థ ప్రతినిధి బల్బీర్​ సింగ్​ ధిలియన్​ ఇంతుకుముందే ప్రకటించారు.

ఫీచర్లు..

  • బ్యాటరీ సామర్థ్యం- 95కేడబ్ల్యూహెచ్​
  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కి.మీ పైగా ప్రయాణించవచ్చు.
  • ధర అంచనా- రూ.1.50 కోట్లు

మహీంద్ర ఈకేయూవీ 100

భారత మార్కెట్లలోకి.. మహీంద్ర ఈకేయూవీ 100 కారు.. ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉంది. ఆటోఎక్స్​పో 2020లో తొలిసారి ప్రదర్శించిన ఈ కారు.. అందరి మన్ననలను అందుకుంది.

ఫీచర్లు..

  • బ్యాటరీ సామర్థ్యం- 15.9 కేడబ్ల్యూహెచ్​
  • వేగవంతమైన ఛార్జింగ్​ సదుపాయం (గంట సేపట్లోనే 80శాతం బ్యాటరీ ఛార్జ్​)
  • ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 147కి.మీల దూరం ప్రయాణించవచ్చు.
  • ధర అంచనా- రూ.8.25లక్షలు

మహీంద్ర ఎక్స్​యూవీ 300 ఎలక్ట్రిక్​

మహీంద్ర ఈకేయూవీ 100తో పాటు మహీంద్ర ఎక్స్​యూవీ 300 మోడల్​ ఎలక్ట్రిక్​ కారు​ను కూడా ఈ ఏడాది మహేంద్ర కంపెనీ తీసుకురానుంది.

ఫీచర్లు

  • బ్యాటరీ సామర్థ్యం (కంపెనీ వెల్లడించలేదు.)
  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 370కి.మీల దూరం ప్రయాణించవచ్చు.
  • ధర అంచనా.. రూ.18 లక్షలు
    మహేంద్ర ఎక్స్​యూవీ 300 ఎలక్ట్రిక్​

జాగ్వార్​ ఐపేస్​

ఎస్​యూవీ కార్ల ఉత్పత్తి సంస్థ తన మొదటి ఈవీని ఈ ఏడాది మార్చిలో భారత మార్కెట్​లోకి తీసుకురానుంది. ప్రపంచవ్యాప్తంగా 2018లో విడుదలైన ఈ ఐపేస్​ కారు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

ఫీచర్లు..

  • బ్యాటరీ సామర్థ్యం- 90 కేడబ్ల్యూహెచ్​
  • ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 270 కి.మీల దూరం ప్రయాణించవచ్చు.
  • ధర అంచనా- రూ.కోటి
    జాగ్వార్​ ఐపేస్​

మారుతీ సుజుకీ వేగాన్​ ఆర్​ఈవీ

2021, సెప్టెంబర్​లో మారుతీ సుజుకీ కంపెనీ తన వేగాన్​ ఆర్​ఈవీ ఎలక్ట్రిక్​ వాహనాన్ని విడుదల చేయనుంది.

  • వేగవంతమైన ఛార్జింగ్​ సదుపాయం(40 నిమిషాల్లోనే 80శాతం ఛార్జింగ్ అవుతుంది​)
  • ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 200కి.మీల దూరం ప్రయాణించవచ్చు.
  • ధర అంచనా- రూ.9 లక్షలు

బజాజ్​ ఆటో కూడా 2021లో విద్యుత్​తో నడిచే.. త్రిచక్ర వాహనాన్ని తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ఇదీ చూడండి:'జియో టవర్లు ధ్వంసమైతే మాకేంటి సంబంధం'

ABOUT THE AUTHOR

...view details