తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్​తో ఒప్పందంపై ఫ్యూచర్​ గ్రూప్​కు సుప్రీం నోటీసులు

FRL-Reliance merger: రిలయన్స్​ రిటైల్​తో ఒప్పందానికి సంబంధించి అమెజాన్​ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించాలని ఫ్యూచర్​ రిటైల్​కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. గతంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది అమెజాన్​.

sc
సుప్రీం కోర్టు

By

Published : Feb 9, 2022, 12:41 PM IST

FRL-Reliance merger: రిలయన్స్‌తో ఫ్యూచర్​ రిటైల్ చేసుకున్న రూ.24,500 కోట్ల ఒప్పందంపై అమెజాన్​ దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై స్పందించాలని ఫ్యూచర్​ గ్రూప్​కు నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదంటూ 'అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం' ఇచ్చిన తీర్పుపై దిల్లీ హైకోర్టు స్టే ఇవ్వడాని వ్యతిరేకిస్తూ.. ఈ కామర్స్​ దిగ్గజం అమెజాన్​ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

అమెజాన్​ వేసిన పిటిషన్​పై ఫ్యూచర్ గ్రూప్​ నుంచి వివరణ కోరుతూ.. సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

రిలయన్స్‌తో ఫ్యూచర్​ గ్రూప్​ చేసుకున్న రూ. 24,500 కోట్ల ఒప్పందంపై ముందుకు వెళ్లకూడదని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఫ్యూచర్​ గ్రూప్​ స్టే ఇవ్వాలని దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సానుకూలంగా స్పందించి.. అమెజాన్​కు వ్యతిరేకంగా న్యాయస్థానం స్టే విధించింది. దీనిపై అమెజాన్​ తిరిగి సుప్రీంకోర్టు తలుపుతట్టింది.

ABOUT THE AUTHOR

...view details