తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఉచితంగా ఇచ్చినా​ కాల్స్​ నాణ్యతలో రాజీపడొద్దు' - ట్రాయ్​ నిబంధనలు

ఉచితంగా వాయిస్​ కాల్స్​ ఇవ్వడమే నాణ్యతలేమికి కారణమంటూ టెలికాం సంస్థలు చెప్పడం సరికాదని ట్రాయ్​ ఛైర్మన్​ ఆర్​ఎస్​.శర్మ స్పష్టం చేశారు. కాల్స్​ నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. నాణ్యమైన సేవలు అందించని ఆపరేటర్లను శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.

trai
ట్రాయ్​

By

Published : Mar 2, 2020, 12:13 PM IST

Updated : Mar 3, 2020, 3:34 AM IST

కాల్స్ నాణ్యత విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ- ట్రాయ్​ ఛైర్మన్ ఆర్​ఎస్​.శర్మ​ కీలక వ్యాఖ్యలు చేశారు. వాయిస్​ కాల్స్​ ఉచితంగా ఇవ్వటమే కాల్స్​ అంతరాయానికి కారణమని టెల్కోలు చెప్పడం సరికాదని అన్నారు.

కాల్స్‌నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని తెలిపారు శర్మ. కాల్‌ డ్రాప్స్‌ విషయంలో తమ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చినప్పటికీ... వినియోగదారుడికి అందించే సేవల్లో నాణ్యతను పెంచే చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

చర్యలు తీసుకుంటాం..

రాబోయే కాలంలో కాల్స్‌ నాణ్యత మెరుగుపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వినియోగదారులు తరచూ కాల్‌డ్రాప్ సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ట్రాయ్‌ ఛైర్మన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రైళ్లు, రహదారులు, రద్దీ ప్రాంతాల్లో నాణ్యత పరీక్షలు చేపడుతామని.. నాసిరకం సేవలు అందిస్తున్న టెలికాం ఆపరేటర్లను శిక్షిస్తామని శర్మ తెలిపారు.

2016లో రిలయన్స్ జియో రాకతో వాయిస్​ కాల్స్​ ధరలు భారీగా పడిపోయాయి. డేటా ప్లాన్లతో కలిపి వాయిస్​కాల్స్​ను ఉచితంగా అందిస్తున్నాయి టెల్కోలు.

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్​: బంగారం అమ్మేస్తున్నారు.. విమానాలకు గిరాకీ

Last Updated : Mar 3, 2020, 3:34 AM IST

ABOUT THE AUTHOR

...view details