తెలంగాణ

telangana

ETV Bharat / business

'జీఎంఆర్'లో ఫ్రెంచ్ సంస్థ భారీ పెట్టుబడి

జీఎంఆర్ విమానాశ్రయ వ్యాపారంలో 49 శాతం వాటాను కైవసం చేసుకుంది ఫ్రాన్స్​కు చెందిన గ్రూప్ ఏడీపీ. ఫిబ్రవరిలో మొదటి విడతగా రూ.5,248 కోట్లు చెల్లించిన ఆ సంస్థ.. తాజాగా మరో రూ.4,565 కోట్లు చెల్లించింది.

France's Groupe ADP concludes 49 per cent share purchase in GMR's airport business
'జీఎంఆర్' వ్యాపారంలో ఫ్రాన్స్ సంస్థ భారీ పెట్టుబడి

By

Published : Jul 8, 2020, 12:57 PM IST

జీఎంఆర్ ఎయిర్​పోర్ట్స్ లిమిటెడ్​ (జీఏఎల్​)లో ఫ్రాన్స్​కు చెందిన గ్రూప్​​ ఏడీపీ రూ.4,565 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీనితో జీఎంఆర్ విమానాశ్రయ వ్యాపారంలో మొత్తం 49 శాతం వాటాను కైవసం చేసుకుంది గ్రూప్​ ఏడీపీ​.

భారీ ఒప్పందం

జీఏఎల్...​ దిల్లీ, హైదరాబాద్​ విమానాశ్రయాలను నిర్వహిస్తుంటుంది. ఈ సంస్థ ఫిబ్రవరి 21న కీలక ప్రకటన చేసింది. ఫ్రాన్స్​కు చెందిన గ్రూప్ ఏడీపీ... తమ కంపెనీలో 49 శాతం వాటాను రూ.10,780 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.

ఇందులో భాగంగా ఫిబ్రవరి 26న మొదటి విడతగా రూ.5,248 కోట్లు చెల్లించి.. జీఏఎల్​లో 24.99 శాతం వాటాను కొనుగోలు చేసింది గ్రూప్ ఏడీపీ.

కరోనా... మార్పులు

కరోనా సంక్షోభం కారణంగా... ఈ ఒప్పందంలో స్వల్పమార్పులు జరిగినట్లు జీఎంఆర్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ప్రకటించింది.

"సవరించిన వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం, జీఏఎల్​లో 24.01 శాతం వాటా కొనుగోలు కోసం పెట్టాల్సిన పెట్టుబడిని... రెండు భాగాలుగా వర్గీకరించాం.

1) ఇప్పుడు రూ.4,565 కోట్లు సహా రూ.1000 కోట్ల విలువైన ఈక్విటీ ఇన్​ఫ్యూజన్ చెల్లించాలి.

2) ఇప్పటి నుంచి 2024 వరకు జీఏఎల్ పనితీరు సంబంధిత లక్ష్యాలకు లోబడి... రూ.1,060 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వచ్చే 5 ఏళ్లలో కొన్ని రెగ్యులేటరీ క్లారిఫికేషన్లతోనూ ఇది ముడిపడి ఉంటుంది."

- జీఎంఆర్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​

ప్రస్తుతం గ్రూప్​ ఏడీపీ నుంచి రెండో, చివరి పెట్టుబడి రూ.4,565 కోట్లు అందుకున్నట్లు జీఎంఆర్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ స్పష్టం చేసింది. ఈ భారీ మొత్తాన్ని రుణాలు చెల్లించేందుకు వినియోగించనున్నట్లు తెలిపింది. ఫలితంగా సంస్థ క్యాష్ ఫ్లో, లాభదాయకత పెరుగుతాయని పేర్కొంది.

ఈ ఒప్పందం ద్వారా జీఎంఆర్ విమానాశ్రయ వ్యాపారం నిర్వహణ, నియంత్రణలో.. గ్రూప్​ ఏడీపీకి హక్కులు కలుగుతాయి. అలాగే జీఏఎల్​ బోర్డులోనూ ప్రాతినిధ్యం లభిస్తుంది.

ఇదీ చూడండి:'జియోమీట్'​కు అప్​డేట్​- కొత్త ఫీచర్స్ ఇవే...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details