దాదాపు రెండు నెలల విరామం తర్వాత మార్కెట్లో ఐపీఓలు సందడి చేయనున్నాయి. ఏప్రిల్ తర్వాత తొలిసారి నాలుగు కంపెనీలు ఓకే వారం ఐపీఓకు రానున్నాయి. ఈ కంపెనీలన్నీ రూ.9,123 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో రెండు సంస్థలు తెలుగు రాష్ట్రాల నుంచే కావడం గమనార్హం.
ఈ ఏడాది చివరి సారిగా.. ఏప్రిల్ 7 నుంచి 9 మధ్య మాక్రోటెక్ డెవలపర్స్ ఐపీఓకు వచ్చింది.
ఈ వారం ఐపీఓకు రానున్న కంపెనీలు..
శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్, సోనా కామ్స్టర్స్ సంస్థలు సోమవారం ఐపీఓ రానున్నాయి. 16న ఐపీఓ ముగియనుంది. కిమ్స్, దొడ్ల డెయిరీ ఈ నెల 16న ఐపీఓ ప్రారంభించనున్నాయి. 18న వీటి ఐపీఓ ముగియనుంది.
శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్
ఇండిగ్రేటెడ్ మెటల్స్ ఉత్పత్తి సంస్థ అయిన శ్యామ్ మెటాలిక్స్.. ఐపీఓ ద్వారా రూ.909 కోట్లు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థ షేరు ప్రైస్ బ్యాండ్‌ను రూ.303-306 మధ్య ఉంచింది.