కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడటం చాలా కష్టమని.. ఈ ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండీయా(ఆర్బీఐ) సమర్థంగా నిర్వహించిందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కితాబిచ్చారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడారు.
"ఆర్బీఐ చర్యలు రెండు లక్ష్యాలు సాధించగలగాలి. ఆర్థిక సంక్షోభాన్ని నివారించి, స్థిరత్వాని సాధించడం ఒకటైతే , ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదక రంగాలకు నగదు బదిలీ చేయడం రెండోది. వీటిని సమతూకంతో నిర్వహించడం ఎంతో కష్టమైనా.. ఆర్బీఐ విజయవంతంగా నిర్వహించి, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకురాగలిగింది" - దువ్వూరి సుబ్బారావు, ఆర్బీఐ మాజీ గవర్నర్