భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ కమలేశ్ చంద్ర చక్రవర్తి (69) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం గుండె పోటుతో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
2009 జూన్ నుంచి 2014 ఆగస్టు వరకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఉన్నారు కేసీ చక్రవర్తి. పదవీ కాలం కన్నా మూడు నెలల ముదే ఆయన రాజీనామా చేశారు.