తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫోర్డ్‌ 2021 ఎకోస్పోర్ట్-‌ ధర ఎంతో తెలుసా? - ఫోర్డ్‌ ఇండియా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మోడల్‌ ఎకోస్పోర్ట్‌లో 2021 వేరియంట్లు

ఫోర్డ్‌ ఇండియా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మోడల్‌ ఎకోస్పోర్ట్‌లో 2021 వేరియంట్లను మార్కెట్​లోకి విడుదల చేసింది. బీఎస్‌-6 పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌లతో ఇవి లభిస్తాయి. పెట్రోల్‌ విభాగం ధరల శ్రేణి రూ.7.99- 10.99 లక్షలు, డీజిల్‌ వేరియంట్‌ల ధర రూ.8.69- 11.49 లక్షలుగా నిర్ణయించారు. కి.మీకి 36 పైసల అతి తక్కువ నిర్వహణ వ్యయం అవుతుందని ఫోర్డ్‌ వెల్లడించింది.

Ford India compact SUV model Expo sport 2021 model released in market and starting price Rs7.99 lakhs
విపణిలోకి ఫోర్డ్‌ 2021 ఎకోస్పోర్ట్-‌ ప్రారంభ ధర రూ.7.99 లక్షలు

By

Published : Jan 5, 2021, 6:51 AM IST

ఫోర్డ్‌ ఇండియా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మోడల్‌ ఎకోస్పోర్ట్‌లో 2021 వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. ఈ వాహనాల ప్రారంభ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ముంబయి). కొత్త ఎస్‌యూవీ అయిదు వేరియంట్లు - యాంబియెంట్‌, టైటానియం, టైటానియం ప్లస్‌, ట్రెండ్‌, స్పోర్ట్స్‌లలో లభించనుంది.

బీఎస్‌-6 పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌లతో ఇది లభిస్తుంది. పెట్రోల్‌ విభాగం ధరల శ్రేణి రూ.7.99- 10.99 లక్షలు, డీజిల్‌ వేరియంట్‌ల ధర రూ.8.69- 11.49 లక్షలుగా నిర్ణయించారు. టైటానియం వేరియంట్‌లో సన్‌రూఫ్‌, కొత్త అధుసంధానత, పొడిగించిన వారెంటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, ఫోర్డ్‌పాస్‌, నేవిగేషన్‌ వంటి సదుపాయాలు కొత్త ఎకోస్పోర్ట్‌లో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. లక్ష కిలోమీటర్లు లేదా మూడేళ్ల వారెంటీ సదుపాయాన్ని వినియోగదారులు ఎంపిక చేసుకోవచ్చని, కి.మీకి 36 పైసల అతి తక్కువ నిర్వహణ వ్యయం అవుతుందని ఫోర్డ్‌ వెల్లడించింది.

ఇదీ చూడండి:ఇక భారత్‌లోనూ లెనోవో టాబ్లెట్​ల తయారీ

ABOUT THE AUTHOR

...view details