మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కొత్త పెట్టుబడులు పెట్టి దేశ ఆర్థికరంగాన్ని పరుగులు పెట్టించాలని పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను కేంద్రఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కోరారు. అఖిల భారత యజమాన్య సంఘం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ప్రైవేటురంగంలో పెట్టుబడులను పెరిగేలా చేయడం కోసం కార్పొరేటు పన్నులను భారీగా తగ్గించినట్లు గుర్తుచేశారు.
"చాలా ఉత్పత్తుల్ని మనం వేగం వంతం చేయాలి. దేశ ఆర్థికరంగాన్ని పరుగులు పెట్టించాలి. ప్రైవేటు రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలి."