తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్యాకేజీ మూడో రోజు వెల్లడించే వివరాలు ఇవే!

కరోనాతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థకు సరైన దిశానిర్దేశం ఇచ్చే విధంగా ప్రకటించిన భారీ ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ వరుసగా మూడోరోజు వివరించనున్నారు. పశుసంవర్ధక, మత్స్య రంగానికి ఊతమిచ్చేలా ఇవాళ ప్రకటనలు చేయనున్నట్లు సమాచారం. వీటితో పాటు మౌలిక రంగం, హోటళ్లు, విమానయాన సంస్థలు, పర్యటక రంగానికి సాయం అందించేలా పలు ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

nirmala
నిర్మల సీతారామన్

By

Published : May 15, 2020, 2:37 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్ధకు ఊతమిచ్చేందుకు 20లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. వరుసగా మూడో రోజు ఆ వివరాలను వెల్లడించనుంది. ఇప్పటికే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వలస కార్మికులు సహా వివిధ వర్గాలకు అందించబోయే సాయం వివరాలను ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఇవాళ మరిన్ని రంగాలకు సంబంధించిన ఉద్దీపన చర్యల్ని తెలియచేయనున్నారు.

మత్స్య రంగంపై దృష్టి

పశుసంవర్ధక, మత్స్య రంగానికి ప్రోత్సాహం, ఉపశమనం లభించే విధంగా ఆర్థికమంత్రి ఇవాళ వివరాలు వెల్లడించవచ్చని తెలుస్తోంది. ఆయా రంగాల్లో సమస్యలపై కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌తో ఇప్పటికే పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు నిర్మల.

లాక్‌డౌన్‌ కారణంగా మత్స్య, అనుబంధ రంగాల్లో 15లక్షల మంది ప్రభావితమైనట్లు సమాచారం. దేశీయ మార్కెట్లో అమ్మకాలు తగ్గడం, ఎగుమతికి ఆస్కారం లేనందున కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలకు ఊరట కల్పించేలా ఆర్థిక మంత్రి ఇవాళ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.

మౌలికానికి ప్రాధాన్యం

మౌలిక సదుపాయాల రంగానికి ఊతమిచ్చేలా ఆర్థికమంత్రి ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 2019-20 నుంచి 2024-25 వరకు రూ.111 లక్షల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదివరకే ఈ ప్రకటన చేసిన ప్రభుత్వం.. దీనికి సంబంధించిన తొలి దశ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాలకు సంబంధించిన కొత్త ఆర్థిక సంస్థను రూపొందిస్తున్నట్లు ప్రకటించవచ్చని సమాచారం.

వీటితో పాటు హోటళ్లు, విమానయాన సంస్థలు, పర్యాటక రంగానికి సాయం అందించేలా కూడా ఆర్థిక మంత్రి ప్రకటన చేయనున్నట్లు సమాచారం. విమాన ల్యాండింగ్, టేకాఫ్ ఛార్జీ తగ్గింపుపై ప్రకటన చేయవచ్చని అంచనా.

ABOUT THE AUTHOR

...view details