తెలంగాణ

telangana

By

Published : Mar 12, 2020, 6:00 AM IST

ETV Bharat / business

విలీన బ్యాంకుల అధిపతులతో నేడు సీతారామన్ భేటీ

ఏప్రిల్ 1 నుంచి 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో నేడు ఆయా బ్యాంకుల అధిపతులతో ఆర్థక మంత్రి నిర్మలా సీతారామన్​ భేటీ కానున్నారు.

nirmala meeting with bankers
బ్యాంకర్లతో నిర్మలా సమావేశం

విలీన బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు సమావేశం కానున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి విలీనం కాబోతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నాయో సమీక్షించేందుకు ఆమె వారితో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

చర్చాంశాలు ఇవే!

యాంకర్‌ బ్యాంకులు ఖాతాదారులకు అంతరాయం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయో.. ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక రంగాలకు రుణ వితరణకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విలీనం తర్వాత బ్యాంకులు తమ ఖాతాదారులకు సేవలు, ఉత్పత్తుల్ని అందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నాయనేది కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

వ్యాపార, ఆర్థిక ప్రణాళికలతో పాటు రుణ, డిపాజిట్ల వృద్ధి వంటి పలు అంశాలపై ఆర్థిక మంత్రి ఆయా బ్యాంకుల అధిపతుల్ని వివరాలు కోరనున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details