ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈనెల 15న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ గురువారం వెల్లడించారు. ఆర్థిక వ్వవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ప్రైవేటు పెట్టుబడులపై దృష్టి సారించిందన్నారు.
'పెట్టుబడులకు భారత్ ప్రధాన కేంద్రంగా మారుతోంది.. ప్రైవెటు రంగం కూడా ఆసక్తి కనబరుస్తోంది' అని సోమనాథన్ పేర్కొన్నారు.