కరోనా లాక్డౌన్ దెబ్బకు దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నీ మూతబడ్డాయి. పలు రంగాలు ఆర్థికంగా కుదేలైపోయాయి. ఎటువంటి కార్యకలాపాలు జరగకపోవడం వల్ల సంస్థలు జీతాలు చెల్లించలేమని చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇక చిన్నపాటి పరిశ్రమలైతే అప్పుల వడ్డీలు తీర్చలేక మూసేస్తామంటున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో సామాన్యుడిని ఆదుకునేదెలా? సంస్థలకు ఆపన్నహస్తం అందించి దేశాన్ని నడిపించేదెలా? వస్తూత్పత్తిని పెంచేందుకు ముందున్న లక్ష్యాలేంటి? అనే అంశాలను పరిశీలించిన భారత ప్రభుత్వం.. ఉద్దీపన చర్యలు ప్రారంభించింది.
దేశానికి వెన్నెముకలా ఉన్న పరిశ్రమలకు చేయూతనిస్తే ఆర్థిక చక్రం పరుగెడుతుందని భావించిన కేంద్రం.. ఆ దిశగా నేడు కీలక ప్రకటనలు చేసింది. మరి వీటి వల్ల సామాన్యుడికి కలిగే ప్రయోజనాలు ఏంటి? ఓ సారి పరిశీలిద్దాం.
12 నెలల మారటోరియంతో రుణాలు...
చిన్న వ్యాపారాలు, ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి రూ. 3 లక్షల కోట్లు కేటాయించారు. పూచీకత్తు లేకుండా, 12 నెలల మారటోరియంతో రుణాలు ఇవ్వనున్నారు. అంటే ఏడాది పాటు రుణాలపై ఎలాంటి తిరిగి చెల్లింపులు చేయక్కరలేదు. ఎంఎస్‌ఎంఈలు తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు, వాటిల్లోని ఉద్యోగులకు భద్రత కల్పించేందుకు ఉపయోగపడనుంది. సంస్థలు కూడా అప్పుల ఊబిలో పడి మూతపడకుండా ఈ సాయం ఆసరాగా నిలవనుంది.
పెట్టుబడులు కోసం రూ.50 వేల కోట్లు...
ఎంఎస్‌ఎంఈల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం రూ.50వేల కోట్లు కేటాయించారు. ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం రూ.10 వేల కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏర్పాటు చేయనున్నారు. శక్తి, సామర్థ్యం ఉన్న ఏ ఎంఎస్‌ఎంఈ అయినా అయినా ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చు. ఎన్‌పీఏ ముప్పు ఎదుర్కొంటున్న సంస్థలకు ఇది లాభదాయకం.
పెట్టుబడులు పెరిగినా అదే పరిధిలో...