తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రభుత్వ బ్యాంకుల సీఈఓలతో నిర్మల భేటీ వాయిదా - ప్రభుత్వ రంగ బ్యాంకులు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. త్వరలోనే సమావేశానికి కొత్త తేదీని ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

fm-meeting-with-heads-of-public-sector-banks-gets-deferred
నిర్మలా సీతారామన్

By

Published : May 11, 2020, 12:01 PM IST

ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరగాల్సిన సమీక్ష సమావేశం వాయిదా పడింది. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరగాల్సిన ఈ భేటీని వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్ష సమావేశం కోసం కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడమే ముఖ్య అజెండాగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రుణ చెల్లింపులపై బ్యాంకులు విధించిన 3 నెలల మారటోరియం సహా దీర్ఘకాలిక రుణాల పురోగతిని సైతం ఈ భేటీలో సమీక్షించాలని నిర్ణయించారు. అయితే ఈ భేటీ వాయిదాకు గల కారణాలు తెలియలేదు.

ఇదీ చదవండి: ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో నేడు నిర్మల భేటీ

ABOUT THE AUTHOR

...view details