వచ్చే ఆర్థిక ఏడాదికి గాను ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కరసత్తు ముమ్మరం చేసింది కేంద్రం. ఈ మేరకు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సోమవారం సమావేశం అయ్యారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మహమ్మారి నేపథ్యంలో మందగించిన ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఆదాయ వనరుల పెంపు దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రులు పలు కీలక సూచనలు చేశారు. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా భేటీ - pre-Budget meeting
దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే దిశగా బడ్జెట్ రూపొందించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది కేంద్రం. ఈ మేరకు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం అయ్యారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్.
'ఆదాయ వనరులు పెంచే దిశగా అడుగులు వేయాలి'
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో కేంద్ర ప్రభుత్వం అన్నీ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇస్తున్న మద్దతును కొనసాగిస్తున్నట్లు నిర్మలా సీతా రామన్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రాలకు అవసరమైన మేరకు రుణాలను మంజూరు చేయడం, పరిమితులను పెంచడం చేసిందన్నారు. ఇందుకుగాను సమావేశంలో పాల్గొన్న సభ్యులు కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.