కరోనాపై పోరులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ పరిశోధనల కోసం బయోటెక్నాలజీ విభాగానికి రూ. 900కోట్ల గ్రాంటు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
అయితే వ్యాక్సిన్ ధర, సరఫరా వ్యయాన్ని ఇందులో జోడించడం లేదని స్పష్టం చేశారు ఆర్థికమంత్రి. టీకా సిద్ధంగా ఉన్నప్పుడు ఆయా ఖర్చులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.