దీపావళికి రెండు రోజుల ముందే మధ్యతరగతి ప్రజలకు పండుగ కానుకలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రజలకు ఊరటనిచ్చే విధంగా 'ఆత్మనిర్భర్ భారత్ 3.0'ను బుధవారం ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఉపాధి, ఇళ్ల నిర్మాణానికి పెద్ద పీట వేస్తూ ఉద్దీపన ప్యాకేజీని ఆవిష్కరించారు. ఆ వివరాలు..
ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన..
- కొత్త ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా.. 'ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన.'
- ఈపీఎఫ్ఐ పరిధిలోని సంస్థ కొత్త ఉద్యోగిని(గతంలో పీఎఫ్‌లో చేరనివారు లేదా ఉద్యోగం కోల్పోయిన వారు) చేర్చుకుంటే... సంస్థకు, ఉద్యోగికి పీఎఫ్ కంట్రిబ్యూషన్‌లో రాయితీ. అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలు.
- రెండేళ్ల పాటు సంస్థ-ఉద్యోగుల కంట్రిబ్యూషన్లు (24శాతం) ఆయా సంస్థలకు అందజేత.
- ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకున్న సంస్థల్లో రూ. 15వేలు కన్నా తక్కువ జీతానికి చేరిన కొత్త ఉద్యోగికి వర్తింపు.
- కరోనా వల్ల 2020 మార్చి 1 అనంతరం ఉద్యోగం కోల్పోయి.. 2020 అక్టోబర్ 1 తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరిన వారు(రూ. 10వేల కన్నా తక్కువ జీతం) కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారు.
- నిబంధన:- కనీసం 2 కొత్త ఉద్యోగాలు(50 కన్నా తక్కువ సిబ్బంది ఉన్న సంస్థలు), కనీసం 5 కొత్త ఉద్యోగాలు(సిబ్బంది 50కు పైబడిన సంస్థలు).
- 2021 జూన్ 30 వరకు ఈ పథకం అమలు.