పండుగలను పురస్కరించుకుని, ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (flipkart big billion days) పేరిట రాయితీ విక్రయాలను అక్టోబరు 7- 12 తేదీల్లో జరపనుంది. లక్షల మంది విక్రేతలు, చిన్న వ్యాపార సంస్థలు, కిరాణా దుకాణాలు, బ్రాండ్లు ఇందులో భాగస్వామ్యం అవుతాయని వెల్లడించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఎన్నో ఉత్పత్తులు ఈ విధంగా చిన్న పట్టణాలకు చేరుకుంటాయని పేర్కొంది.
రాయితీ..
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డులతో కొనుగోళ్లపై 10శాతం వరకు రాయితీ (flipkart offers) లభిస్తుందని తెలిపింది. అవసరమైన వస్తువులను ముందస్తుగా బుక్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. కిరాణా దుకాణాలకు రూ.8లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నట్లు సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు.