ఫ్లిప్‌కార్ట్ మరోసారి మొబైల్ ప్రియుల కోసం భారీ ఆఫర్లను తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ కార్నివాల్ సేల్(flipkart smartphone carnival sale 2021) పేరుతో వినియోగదార్లకు అందుబాటులోకి వచ్చిన ఈ డిస్కౌంట్ వేడుక సెప్టెంబర్ 8 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఐఫోన్ 12తో పాటు ఐఫోన్ 12 మినీ, రియల్మీ ఎక్స్ 7 మ్యాక్స్ తదితర మొబైల్స్‌పై ఏకంగా రూ. 12,901 తగ్గింపును ప్రకటించింది.
భారీ తగ్గింపుతో మొబైల్స్
- రూ.79,900 విలువ గల 64 జీబీ ఐఫోన్ 12(iphone 12)ను రూ.66,999లకే అందుబాటులో ఉంచింది. అంటే ఈ మొబైల్‌పై రూ. 12,910 డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే రూ. 84,900 విలుగల ఐఫోన్-12 128 జీబీ మోడల్‌ను డిస్కౌంట్ పోగా 71, 999 రూపాయలకు అందిస్తోంది.
- ఐఫోన్ 12 మినీ (iphone 12 mini) విషయానికి వస్తే రూ. 69,900 విలువ గల ఈ ఫోన్ డిస్కౌంట్ పోగా రూ. 59,999కే లభించనుంది. అంటే ఈ మొబైల్‌పై రూ.9,901 డిస్కౌంట్‌ను వినియోగదారులు పొందనున్నారు.
- రూ. 54,900 ఒరిజినల్ ధర కలిగిన ఐఫోన్ 11 (iphone 11) కూడా రూ. 51,999 ధరకే లభించనుంది. అలాగే రూ 47,900 విలువ ఐఫోన్ ఎక్స్ఆర్ రూ. 42,999 ధరకు కొనుగులు చేయొచ్చు.
- ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ మొబైల్ కొనాలనుకుంటే రియల్మీ ఎక్స్7 మ్యాక్స్(realme x7 max)పై మంచి ఆఫర్ ఉంది. ఇది మీకు రూ.26,999 ధరకే లభించనుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే మరో రూ.3000 డిస్కౌంట్ వస్తుంది.
- ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్(infinix hot 10s)పైనా డిస్కౌంట్ ఉంది. ఒరిజినల్ ధర రూ.9,999 విలువ గల ఈ మొబైల్ డిస్కౌంట్ పోగా రూ.9,499కి అందుబాటులో ఉంది.
డిస్కౌంట్ పోగా మిగతా ఫోన్ల ధరలు